గ్రేటర్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ రివ్యూ….

125
ktr review on mcrhrd great hyderabad

ఎంసీఆర్‌హెచ్ఆర్డీలోఏ గ్రేటర్‌ నగర అభివృద్ధిపై కేటీఆర్‌ రివ్యూ నిర్వహించారు. రోడ్డు విస్తరణ,నాలాల ఆక్రమణలపై ప్రధానంగా కేటీఆర్‌ చర్చజరిపారు. ఈ చర్చకు గ్రేటర్‌ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు మొదలవుతాయని. 8వేలకు పైగా గ్రేటర్‌లో ఆక్రమనిర్మాణాలు గుర్తించాం అని ఆయన అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ 216కి.మీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై సర్వే జరిగిందని,..బస్ట్‌స్టాప్‌ల పున నిర్మాణానికి ఎమ్మెల్యేలు నిధులిస్తున్నారని… కొత్త వారికి లోన్లు ఇపించి వారిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. 17వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు టెండర్లను పిలిచాం. గ్రేటర్‌లోని గోడలమీద పిచ్చిరాతలు,వాల్‌ పోస్టర్లు వేసే వారిపై కఠినమైన చర్చలు తీసుకుంటాం.బహిరంగ ప్రదేశల్లో చెత్త వేయడం,మూత్ర విసర్జన చేస్తే చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. జనవరి 3న లేదా 4న మరోసారి గ్రేటర్‌ నగర అభివృద్ధిపై సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.