అక్టోబర్‌లోగా కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులు పూర్తి: కేటీఆర్

214
ktr
- Advertisement -

అక్టోబర్ లోగా కాళేశ్వరం ప్యాకేజీ -9 పనులను పూర్తి చేయాలన్నారు మంత్రి కేటీఆర్. మిషన్ మోడ్ లో పనులు చేపట్టాలి… జిల్లాలోని 666 చెరువులు నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న ప్యాకేజీ 9 పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మంత్రి కే తారకరామారావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ప్రగతి భవన్ లో ప్యాకేజీల 9 పనుల ప్రగతి పై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డా. రజత్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ ENC నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంచా రెడ్డి, SE సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి లతో సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని ఇరిగేషన్ అధికారులు మంత్రి కే తారకరామారావు కు వివరించారు.

ప్యాకేజీ 9 కు సంబంధించి న 12.035 కిమీ మేర సొరంగం సిమెంట్ లైనింగ్ ,పంపు హౌస్ , సర్జ్ పూల్ పనులను వేగంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ ENC నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంచా రెడ్డి, SE సుధాకర్ రెడ్డి లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు ప్రగతిని పరిశీలించాలన్నారు. క్షేత్ర అధికారులు, గుత్తేదారులు తో సమీక్షించి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు.

వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి మధ్య మానే రు జలాశయం నుండి ఎగువ మానే రు జలాశయం ను గోదావరి జలాలతో నింపుతామన్నా రు.అప్పటిలోగా ప్యాకేజీ 9 కు సంబంధించి ప్రధాన కాలువల, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ, కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా అక్టో బర్ లో ప్యాకేజీ 9 ద్వారా 30 వేల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించే వీలు కలుగుతుంద నీ మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలోని 666 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

- Advertisement -