- Advertisement -
రైతాంగానికి సాధ్యమైనంత మేర ఎక్కువగా ప్రయోజనం కలిగించాలన్న సదుద్దేశ్యంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్దతిలో సాగుకు శ్రీకారం చుట్టిందనీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. పకడ్బందీ వ్యూహం, కార్యాచరణతో ముందుకు సాగితే ఈ విధానంలో తెలంగాణ, ప్రపంచానికే నమూనాగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వానాకాలం సాగు, నియంత్రిత పద్దతిలో సాగు విధానం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 పురోగతి, ప్రధాన, పంపిణీ కాలువల భూసేకరణ ప్రగతిపై మంత్రి రైతు బంధు సమితి జిల్లా, సిరిసిల్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులు, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
- Advertisement -