చేనేత మగ్గాల సర్వే పూర్తి

303
KTR Review on Chenetha
- Advertisement -

రాష్ర్టంలోని చేనేత పరిశ్రమ పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు  చేనేత , జౌళి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఇవాళ  బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో చేనేత శాఖపై రివ్యూ నిర్వహించిన కేటీఆర్  రాష్ర్టంలో మొత్తం  16,776 చేనేత మగ్గాలున్నట్లు వెల్లడించారు. వీటిలో  5,505 మగ్గాలు సోసైటీల పరిధిలో ఉన్నాయని  చేనేత శాఖ చేసిన సర్వే ద్వారా చేనేత పరిశ్రమ పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

చేనేత కోసం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఎలాంటి లీకేజీలు లేకుండా చేనేత కార్మికులకు పథకాల ప్రతిఫలాలు అందేలా చూసే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి మగ్గాన్ని జీయోట్యాగ్ చేస్తూ, మగ్గం పోటోను సైతం సేకరించడం జరిగిందన్నారు. ఈ మగ్గాలన్నీ అధార్ అనుసంధానం సైతం పూర్తయిందన్నారు.

KTR Review on Chenetha
సర్వేప్రకారం రాష్ర్టంలో జరుగుతన్న చేనేత వస్ర్తాల మెత్తం ఉత్పాదక సామర్ధ్యం 209 లక్షల మీటర్లు ఉందన్నారు. ఇందులో సింహ భాగం కాటన్ 106.36 లక్షల మీటర్లు, 57.38 లక్షల మీటర్లు, 38.10 లక్షల మీటర్ల పాలియస్టర్, 7.62 లక్షల మీటర్లు మీటర్ల ఉన్ని వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిందన్నారు. మెత్తం ఈ వస్ర్తాల వార్షిక ఉత్పాదక విలువ 717 కోట్ల రూపాయాలుగా ఉందన్నారు.  ఇందులో ఎనబై శాతం పట్టు వస్ర్ర్తాల విలువ 539 కోట్లుగా ఉన్నదన్నారు. మిగిలిన వాటిలో కాటన్, సిల్క్, ఉన్ని, పాలియస్టర్ వస్ర్తాలున్నాయని మంత్రి తెలిపారు. ఇన్ని రకాల ప్రొత్సాహాకాలు ఇచ్చిన తర్వతా వారి ఉత్పత్తులకు డిమాండ్ వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కార్పోరేషన్ ఎర్పాటు వేంటనే పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం మెత్తం రాష్ర్టంలోని చేనేత పరిశ్రమకు సూమారు 206 కోట్ల  విలువైన యార్న్ అవసరం అవుతుందని, ఇందులో రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న 40 శాతం ఇన్ పుట్ సబ్సీడీకి 82 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మంత్రి తెలిపారు. ఇది కేంద్రం ఇచ్చే 10 శాతం సబ్సీడికి అదనమని మంత్రి తెలిపారు. ఇప్పటికే తమిళనాదులోని కోఅప్టెక్స్ నమూనాను చేనేత శాఖ అధికారులు అధ్యయనం చేశారని మంత్రి తెలిపారు.  ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -