మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే

470
ktr
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే అన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులతో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ లో పలువురు యంఏల్యేలు, యంఏల్సీలు, యంపిలు, సీనియర్ నాయకులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపైన చర్చించారు. ఒక్కోక్క నాయకుడితో ప్రత్యేకంగా సమావేశం అయి స్థానికంగా ఎన్నికల కోసం నడుస్తున్న కార్యచరణపైన, క్షేత్ర స్ధాయి ప్రచారం, అభ్యర్ధుల ఎంపిక, పార్టీ విజయం కోసం అనుసరిస్తున్న వ్యూహాలపైన చర్చించారు. ఇప్పటికే నామినేషన్లు పూర్తయిన నేపథ్యంలో ప్రచారం పైన ఫోకస్ పెట్టాలని అదేశించారు.

ktr

అభ్యర్ధుల ఏంపిక, భి ఫారాల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నామినేషన్ పూర్తయినాక అయా పట్టణాల్లో వచ్చిన నామినేషన్లు, పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నుంచి రెబెల్ అభ్యర్ధులుగా పోటీలో ఉండే వారితో నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు.

పట్టణ ప్రజల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తుందని ఎమ్మెల్యేలు కేటీఆర్ కు తెలిపారు. అయినప్పటికీ కూడా రానున్న పది రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని సూచించారు. గెలుపు ఖాయం అయినా పెద్ద ఎత్తున స్ధానాలు గెలుసుకునేలా కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు కెటియార్ సూచించారు.

- Advertisement -