కవిత సస్పెన్షన్ పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి అన్నారు. పార్టీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం … నిర్ణయం తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏముండదు అన్నారు.
వారం కిందట ఇదేరోజు కాళేశ్వరం మీద లేని పోనీ ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వయిరీ వేశారు..ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలించి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తున్నాడు అన్నారు కేటీఆర్. తల ఉన్నోడు ఎవరైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు…..తలా తోక తెల్వనోడే తోక దగ్గర శంకుస్థాపన చేస్తాడు… మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే రైతులు ప్రశ్నిస్తారనే అక్కడ చెయ్యట్లేదు అన్నారు.
అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదు … రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు అన్నారు. 20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించాము..మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేట్ కాదు.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్..
కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు అన్నారు కేటీఆర్.

