దేశ వ్యాప్తంగా స్కూళ్లలో చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ చిన్నారి ని టీచర్ వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ స్కూల్ కు చెందిన 11 ఏళ్ల బాలిక స్కూల్ కు యూనిఫాం వేసుకోకుండా వెళ్లింది. దీంతో సరైన యూనిఫాం వేసుకురాలేదని బాయ్స్ టాయిలెట్స్ లో నిలబెట్టి ఆ అమ్మాయిని స్కూల్ టీచర్ శిక్షించాడు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది అమానవీయ ఘటన అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనను రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి.. ఎలాగైనా స్కూల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆయన ట్వీట్ చేశారు.
Ridiculous & absolutely inhuman. Will take it up with Hon'ble Deputy CM education for appropriate action on the school https://t.co/Te2AndUZhF
— KTR (@KTRTRS) September 10, 2017
కాగా, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్ స్కూల్ పై కేసు నమోదు చేసి చిన్నారిని శిక్షించిన ఆ టీచర్ ను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. స్కూల్ లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.