రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేటీఆర్ చూపే చొరవ అద్భుతం. ఓ వైపు ప్రభుత్వ,పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటునే మరోవైపు సోషల్ మీడియలో సైతం కేటీఆర్ యాక్టివ్‌గా ఉంటారు. ఎంతపెద్ద సమస్యైన తన దృష్టికి వస్తే పరిష్కరించడమే కాదు అధికారులను సైతం ఉరుకులు,పరుగులు పెట్టిస్తారు.
ఇక ఈ నెల 24న కేటీఆర్ 42వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పార్టీ శ్రేణులు,మిత్రులు,శ్రేయోభిలాషులకు ట్వీట్టర్ ద్వారా కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు వృధా ఖర్చు చేయకుండా ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందచేయాలని సూచించారు.
అంతేగాదు అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు,హోర్డింగ్‌లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడైనా హోర్డింగ్‌లు ఉంటే వాటిని తొలగించాలి కమిషనర్ జనార్దన్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్‌ను కోరుతున్నానని తెలిపారు.
Absolutely agree with you. Request my friends who are spending money on hoardings & paper advertisements to donate the same to Chief Minister’s Relief Fund
Also have asked @CommissionrGHMC @bonthurammohan @GHMCOnline to take down any/all such hoardings asap https://t.co/LHUNWPSuwr
— KTR (@KTRTRS) July 22, 2018