పోరాటస్పూర్తికి నిలువెత్తురూపం..’రావి’

6
- Advertisement -

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి కేటీఆర్.

తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడు అని కొనియాడారు.

విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులు నారాయణ రెడ్డి . భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన అరుదైన రికార్డు వారి సొంతం అన్నారు. రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని ప్రతినబూనుదాం అని పిలుపునిచ్చారు.

- Advertisement -