భారత్‌ దిగ్గజ పారిశ్రామికవేత్తను కొల్పోయింది:కేటీఆర్

290
ktr

కార్పొరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) ఇవాళ ఉదయం కన్నుమూశారు.  ఆయన మరణవార్త తనను కలచివేసిందని భారతదేశం ఒక్క కార్పొరేట్ దిగ్గజాన్ని కొల్పోయిందని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.పరిశ్రమల శాఖ మంత్రిగా  ఆయనతో కలిసిన అనుభవాలను మర్చిపోలేని తెలిపారు. భారత బ్రాండ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని దేవేశ్వర్‌తో కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు

ఐటీసీని ఒక ఎఫ్‌ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్‌కే దక్కుతుంది. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలో ఒక దిగ్గజ కంపెనీకి సుదీర్ఘకాలం ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్దిమందిలో దేవేశ్వర్ ఒకరు. 1968లో ఐటీసీ చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ స్ధాయికి చేరారు. 2017 వరకు ఆయన ఐటీసీకి సీఈవోగా కూడా పనిచేశారు. 2018 జనవరిలో ఐటీసీ ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది.

దేవేశ్వర్‌ నేతృత్వంలో కంపెనీ బాట్‌ నుంచి టేకోవర్‌ ముప్పును విజయవంతంగా తప్పించుకొంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి దిగి విజయవంతంగా ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఐటీసీ ఆదాయం రూ.5,200 కోట్ల నుంచి రూ.51,000 కోట్లకు చేరింది. 2011లో ఆయన పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు.