దళిత ఉద్యమ ధ్రువ తార భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. తెలంగాణ వైతాళికుడు..అణగారిన వర్గాల ఆత్మగౌరవ దీపిక అన్నారు. భాగ్యరెడ్డి వర్మ..దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త,అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజల కోసం గళమెత్తిన సామాజిక ఉద్యమకారుడు అన్నారు.
వందేండ్ల క్రితమే దళిత బిడ్డలకోసం హైదరాబాద్ లో 26 పాఠశాలలు నడిపిన అక్షర సూర్యుడు… ప్లేగు మహమ్మారి కబళించినప్పుడు నగరంలో గొప్ప సేవలు అందించిన ఆదర్శ సంఘ సేవకుడు అని కొనియాడారు. బాల్య వివాహాలు..జోగిని ఇతర సాంఘిక దురాచారాల మీద పోరాడిన పాత్రికేయుడు,
దేశమంతా తిరిగి బహుభాషల్లో భావజాల వ్యాప్తిచేసిన గొప్ప వక్త అన్నారు.
మరుగునపడిన ఆ మహనీయుడిని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంది..భాగ్యరెడ్డి వర్మ జయంతి..వర్ధంతులను అధికారికంగా నిర్వహించిండమే కాదు..ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది అన్నారు. భాగ్యరెడ్డి వర్మ చూపిన బాటలో నడుస్తూ.. గురుకుల విద్యా విప్లవంతో బడుగు బలహీనవర్గాల బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపింది అన్నారు. దళితోద్యమ వేగుచుక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం అన్నారు.
దళిత ఉద్యమ ధ్రువ తార!
తెలంగాణ వైతాళికుడు !
అణగారిన వర్గాల ఆత్మగౌరవ దీపిక !
భాగ్యరెడ్డి వర్మ..దేశం గర్వించదగ్గ
సంఘ సంస్కర్త !అంబేద్కర్ కన్నా ముందే పీడిత
ప్రజల కోసం గళమెత్తిన
సామాజిక ఉద్యమకారుడు!వందేండ్ల క్రితమే దళిత బిడ్డలకోసం హైదరాబాద్ లో
26 పాఠశాలలు నడిపిన అక్షర… pic.twitter.com/WtcGd7SUY8— KTR (@KTRBRS) May 22, 2025
Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

