నవశకానికి నాంది పలికిన రోజు:కేటీఆర్‌

203
- Advertisement -

2009 నవంబర్‌29న ఒక బక్కపలచని వ్యక్తి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశారు అంటే భవిష్యత్‌ తరాలు కొంచెం నమ్మడం కష్టం. కానీ ఇది నిజం అని తెలియజేయాల్సిన రోజు. తొలి దశ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి ఆసరాతో మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని చురకత్తుల లాంటి నాయకులను తయారు చేసిన ధీశాలి సీఎం కేసీఆర్‌. నేటితో ఆయన చేసిన ఆమరణ నిరహార దీక్షకు దిగి 13యేళ్లు పూర్తైనవి. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు.

‘మీ పోరాటం అనితర సాధ్యం. ఒక నవశకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్‌ 29, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇది. దీక్షా దివస్ #DeekshaDivas’ అని ట్వీట్‌ చేశారు.

ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ.

ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ నుంచి దీక్షాస్థలైన సిద్దిపేటకు కేసీఆర్‌ బయలుదేరగా, కరీంనగర్‌ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్‌ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్‌ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్‌ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు.

ఇవి కూడా చదవండి…

దీక్షా దివస్…చరిత్రను మలుపు తిప్పినరోజు

బైరాన్ పల్లి చిత్రం చాలా బాగుంది..

వెలుగుల తెలంగాణమా :కేసీఆర్‌

- Advertisement -