ఆ గట్టునుంటారా…ఈ గట్టునుంటారా:కేటీఆర్

252
KTR jagtial
- Advertisement -

ఓటుతో ప్రజాకూటమికి బుద్దిచెప్పి…టీఆర్ఎస్‌ను దీవించాలని కోరారు మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్ …కాంగ్రెస్,టీడీపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు. బహిరంగసభ అధ్యాంతం తనదైన శైలీలో ప్రభుత్వ పనితీరును వివరిస్తునే విపక్షాల వైఖరిని తప్పుబట్టారు.

రామ్‌ చరణ్‌..రంగస్థలంలోని పాటను గుర్తు చేశారు. ఆ గట్టున ఉంటారో..ఈ గట్టున ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓ వైపు రైతులకు కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఉందని ..మరోవైపు కరెంట్ కోతలతో ప్రజలను 60 సంవత్సరాలు హరిగోస పెట్టిన కూటమి ఉందన్నారు. నాడు కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్,టీడీపీ ఆ గట్టున ఉందని..ఈ గట్టున రైతుల పక్షపాతి కేసీఆర్ ఉన్నారని అన్నారు. రాజన్న,రాజవ్వ అందరూ టీఆర్ఎస్‌కు అండగా ఉండాలని కోరారు కేటీఆర్.

ఓ దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించేలా ప్రతిఒక్కరు టీఆర్ఎస్‌కు ఓటేసేలా ప్రచారం చేయాలన్నారు. ఉత్తమ్,చంద్రబాబు కలిసి వస్తున్నారని కానీ టీఆర్‌ఎస్‌ సింహం లాగా సింగిల్‌గా వస్తోందన్నారు. డిసెంబర్‌ 11న కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -