మంత్రి కేటీఆర్‌కు మరో అంత‌ర్జాతీయ ఆహ్వానం..

144
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌కు మరో అంత‌ర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మే 1 నుంచి 4వ తేదీ వ‌ర‌కు మిల్కెన్ ఇనిస్టిట్యూట్ 25వ వార్షిక స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. సెల‌బ్రేటింగ్ ద ప‌వ‌ర్ ఆఫ్ క‌నెక్ష‌న్ పేరుతో స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. అయితే త‌మ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల‌ని మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది.

అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు ఆహ్వానించినందుకు మిల్కెన్ ఇనిస్టిట్యూట్‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా త‌ర్వాత ప్ర‌పంచ ప్ర‌ముఖుల‌కు క‌లిసేందుకు ఇది మంచి వేదిక అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా,ఈ స‌ద‌స్సుకు వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

- Advertisement -