మంత్రి కేటీఆర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కొండంత అండగా నిలిచారు. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహుల్ జిల్లాలో అపహరణకు గురైన తన తల్లిని కాపాడాలని హైద్రాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గరిమ అనే యువతి తెలంగాణ రాష్ట మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆ యువతి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను అభ్యర్థించారు.
ఆమె ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. బీహార్ డీజీపీని సంప్రదించి విషయం తెలియజేశారు. గరిమ తల్లి ఆచూకీ కనుగొని, రక్షించాలని కోరారు. మీ తల్లి క్షేమంగా తిరిగి వస్తారంటూ గరిమకు భరోసా ఇచ్చారు.
Very sorry to hear that Garima Ji
Request @TelanganaDGP to speak to your counterpart in Bihar. Will reach out to @NitishKumar office too
Also I request all to retweet and spread the word to help locate Garima’s mother https://t.co/wDbwxOSWrs
— KTR (@KTRTRS) February 1, 2020