చట్టాలు మరింత కఠినంగా మార్చుకొవాలి :కేటీఆర్‌

119
sharukh
- Advertisement -

జార్ఖండ్‌లోని దుమ్కాలో ఓ 12 ఏండ్ల బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న‌పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. బాలిక‌ను హ‌త్య చేసిన అత్యంత క్రూర‌మైన క్రిమిన‌ల్ షారూఖ్‌కు ఈ స‌మాజంలో  చొటు లేద‌ని కేటీఆర్ అన్నారు. ఆ క్రిమిన‌ల్‌ మొహంలో ఎలాంటి ప‌శ్చాత్త‌ప జాడలు క‌నిపించ‌డం లేద‌న్నారు. ఈ సందర్భంగా ఐపీసీ, క్రిమిన‌ల్ ప్రోసిజ‌ర్ కోడ్‌, జువైన‌ల్ చ‌ట్టాల‌ పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత ఉందని అని అన్నారు. వాటిని పూర్తిగా సమూలంగా మార్చి ఇలాంటి నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.  నిందితులు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే బ‌ల‌మైన చ‌ట్టాలు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -