రామారావు ఆన్‌ డ్యూటీ.. !

68
- Advertisement -

ఇది ర‌వితేజ సినిమా టైటిల్ కాదు..మంత్రి కేటీఆర్ క‌మిట్ మెంట్ చూసి నెటిజ‌న్లు ఇస్తున్న కామెంట్స్. ఎడ‌మ కాలి చీల‌మండ కండ‌రం గాయంతో మంత్రి కేటీఆర్‌కు మూడు వారాల విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ని కూడా వాయిదా వేసుకున్నారు కేటీఆర్.

ఇక ఇంట్లో నుండి కూడా వ‌ర్క్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. తన విభాగం ఫైల్స్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్‌ చేశారు కేటీఆర్. వర్క్‌ఫ్రమ్‌ హోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతోందని చెప్ప‌గా దీనిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు.

కేటీఆర్…రామారావు ఆన్ డ్యూటీ అంటూ కామెంట్స్ చేశారు.

- Advertisement -