బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌!

72
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్. బంగారం ధ‌ర‌లు దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.320 నుంచి రూ.380 వరకు తగ్గుముఖం పట్టగా కేజీ వెండిపైన కూడా రూ.500 వరకు తగ్గింది. దీంతో హైదరాబాద్ 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,780 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,580గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,580గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,780గా ఉండ‌గా చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,580గా ఉంది.

- Advertisement -