జూన్ 1 న అమెరికా లోని డల్లాస్ నగరం లో జరిగే బీ ఆర్ ఎస్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ను తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ ,ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ,బీ ఆర్ ఎస్ గ్లోబల్ ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ,చందు తాళ్ల ,అభిలాష్ రంగినేని ,పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ… బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్.ఆర్.ఐ సెల్ కోఆర్డినేటర్ …బిఆర్ఎస్ రజతోత్సవ సభలను విదేశాల్లో ఘనంగా జరుపుతున్నాం అన్నారు. అమెరికాలో జూన్ 2వ తేదీన డల్లాస్ లో సభ నిర్వహిస్తున్నాం అన్నారు. అమెరికాలో జరిగే సభకు కేటీఆర్ హాజరవుతారు… డల్లాస్ నగరం అంటే
కేసీఆర్ కు ఇష్టం అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. డల్లాస్ లో నిర్వహించే సభలో పాల్గొనేందుకు తెలంగాణ,తెలుగు ఎన్.ఆర్.ఐ లు పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు,తెలుగు వారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు అన్నారు మాజీ మంత్రి తలసాని. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో అనేక అద్భుతాలు జరిగాయి.. బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అన్నారు. ఎల్కతుర్తి బహిరంగ కనివినీ ఎరుగని రీతిలో జరిగింది అన్నారు. ఎన్.ఆర్.ఐలుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు.
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం,బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు డల్లాస్ లో జరగబోతున్నాయి అన్నారు. డల్లాస్ లో జరిగే కార్యక్రమంలో తెలంగాణ,తెలుగు ప్రజలు పాల్గొనాలి… అమెరికాతో పాటు యూ.కే, కెనడా,ఆస్ట్రేలియా,లాంటి దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతాయి అన్నారు.
Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి

