ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన: కేటీఆర్

18
- Advertisement -

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను వేధించే పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసి కేటీఆర్.. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. కానీ 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ 420 హామీలను చూసి ప్రజలు మోసపోయారన్నారు. రుణమాఫీ కాలేదు, రైతుభరోసా రాలేదు, రైతుబీమా ప్రీమియం కట్టలేదు, సాగునీళ్లు రాలేదు, పంటల కొనుగోళ్లు జరగడం లేదు, రూ.500 క్వింటాలు ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదు.

కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా.. రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తున్నారు అని ఆగ్రహం చేశారు. కేసీఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ మాయమైంది, దవాఖానాల్లో మందులు లేవు, వరంగల్ దవాఖాన నిర్మాణం నిలిపేశారు, TIMS దవాఖానల నిర్మాణం ఆపేశారు.

పాలమూరు రంగారెడ్డి పనులు పడావు పెట్టారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.. విషాహారం తిని ప్రాణాలు తీసుకుంటున్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. తెచ్చిన అప్పులను 20 శాతం కమీషన్లు దండుకుని బిల్లులు చెల్లిస్తున్నారు అని ఆరోపించారు.

Also Read:TTD:వాల్మీకిపురం పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -