KTR:ప్రజ్వల్‌ని ఎందుకు దేశం విడిచేలా చేశారు?

16
- Advertisement -

మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జర్నలిస్టు రాజ్ దీప్ సర్దాయ్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్…కర్ణాటక ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ లైంగిక వేధింపుల‌కు సంబంధించిన వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు.

మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించిన వ్య‌క్తి దేశం విడిచి ఎలా పారిపోగ‌లిగాడు. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ త‌ప్పించుకోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంది. ఒక వేళ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు కేంద్రం స‌హ‌కారం లేన‌ట్లైతే వెంట‌నే దేశానికి తిరిగి తీసుకొచ్చి చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాలని డిమాండ్ చేశారు. మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న వేధింపులను ప‌ట్టించుకోవ‌డం లేదు. బిల్కిస్ బానో రేపిస్టుల‌ను విడుద‌ల చేశారు. బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌పై మ‌హిళ రెజ‌ర్లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది అని ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -