తెలివి తక్కువ కాంగ్రెస్‌తో భద్రం: కేటీఆర్

15
- Advertisement -

నిన్న గేటు ఎత్తుకెళ్లారు..!,నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు..!!,ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా ?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆడబిడ్డలారా…! ,ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం..!! అన్నారు. అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా ?,
కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా ?? అన్నారు,

సాగు నీళ్లిచ్చే సోయి లేదు..పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు.. కానీ..రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా ?, బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ??,తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా ?,ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా ?? అన్నారు.

Also Read:హరిత ప్రేమికునికి కానుకగా మొక్కలు నాటుదాం

 

- Advertisement -