నిన్న గ్రౌండ్ వాటర్ పడిపోయింది కరువొచ్చిందటూ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు రైతులకు ఇప్పుడు వరి వేయొద్దు , బోర్లు వేయొద్దు అంటూ సూచనలు చేశారు.అసలు గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గింది, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఎందుకు కాలేదు అనేది మౌలికమైన ప్రశ్న. దీనిని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.
మీరి దానికెవరు సమాధానం చెప్పాలి ?
గ్రౌండ్ వాటర్ రీచార్జ్ మెకానిజం ఏమిటి
అయితే వర్షం మీద ఆధారపడటం లేకపోతే వేరే సోర్సెస్ ద్వారా వాటర్ బాడీస్ నింపుతూ రీచార్జ్ కి దోహదపడటం తప్ప ఇంకో వేరే దారేముంది?
గత తొమ్మిదిన్నరేండ్ల ప్రభుత్వ ప్రాక్టీస్ ఏంటి?
అందుబాటులో ఉన్న వాటర్ సోర్సెస్ ద్వారా టైంలీ చెరువులు నింపడం, ఎండాకాలంలో సైతం చెరువులు, చెక్ డ్యాంలు నిండుగా ఉండేలా చూసుకోవడం ద్వారా గ్రౌండ్ వాటర్ కి ఎలాంటి ధోఖా లేకుండా ప్లాన్ చేసారు.
ఇంకా చెప్పాలంటే ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉపరితల నీటి వినియోగం పెరిగి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. తద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతూ వచ్చింది.
మరి ఇప్పుడేం జరుగుతోంది ?
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక తెలిసి చేస్తున్నారో , కావాలని ముర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారో ఏమో గానీ ఈ రీచార్జింగ్ ప్రాక్టీస్ ని బందు పెట్టి తమాషా చూస్తున్నారు , ఫలితం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేవు పంటలు మానుకోండి అంటూ హెచ్చరించే పరిస్థితి వచ్చింది.
కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఏరియానే ఉదాహరణగా తీసుకుంటే
ఈ ప్రాంతంలో 2020 లో గ్రౌండ్ వాటర్ లభ్యత 125.5 TMC లు
ఇదే ప్రాంతంలో రెగ్యులర్ ప్రాక్టీసేస్ తో కాళేశ్వరం ద్వారా చెరువులు, వాగులు నింపడం వల్ల 2022 నాటికి పెరిగిన గ్రౌండ్ వాటర్ లభ్యత 160.5 TMCలు
ఏకంగా 35 TMC లు పెరిగింది.
ఇదే ఏరియాలో మిషన్ కాకతీయ ద్వారా పైలెట్ ప్రాజెక్టులుగా 9 వాటర్ షెడ్స్ ని తీసుకుంటే
2020 లో 10.8 TMC ఉన్న నీటి లభ్యత 2022 నాటికి 12.4 TMC కి పెరిగింది
ఈ ప్రాసెస్ లో చెరువులు, చెక్ డ్యాంలు, వాగుల్లో నీళ్ళు ఉండటం వల్ల ఉపరితల నీటి వినియోగం పెరిగి గ్రౌండ్ వాటర్ యూసేజ్ తగ్గింది
2020 లో ఈ ప్రాంతంలో 64% గ్రౌండ్ వాటర్ తోడుకుంటే 2022 నాటికి అది 55% కి తగ్గింది.
అదే 9 మిషన్ కాకతీయ ప్రాజెక్టుల ఏరియాలో 71% నుండి 67% కి తగ్గింది
మిగతా ప్రాజెక్టుల కింద ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గితే తరువాతి సీజన్ కొంచెం అటు ఇటు అయినా వాడని గ్రౌండ్ వాటర్ తర్వాతి సీజన్ కి అందుతుంది , అలా ఉపయోగపడుతుంది. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గితే ఆటోమెటిక్ గా కరెంట్ వినియోగం తగ్గినట్లే.
ఉన్న చెక్ డ్యాం లకు తోడుగా 2021 లో మరో 1250 చెక్ డ్యాంలు కట్టడానికి నిర్ణయం తీసుకుని దాదాపుగా పూర్తి చేసింది కెసిఆర్ సర్కార్ , ఈ లెక్కన ఇంకా పెరగాలి గ్రౌండ్ వాటర్
కానీ కాంగ్రెస్ వచ్చిన్నాటి నుండి ఈ రీచార్జ్ బందు పెట్టి ఇసుక మీద దృష్టి పెట్టి ఇప్పటి ఈ పరిస్థితికి కారణమైంది.
Also Read:బీజేపీ అంటేనే బీసీల పార్టీ!
నిన్న గ్రౌండ్ వాటర్ పడిపోయింది కరువొచ్చిందటూ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు రైతులకు ఇప్పుడు వరి వేయొద్దు , బోర్లు వేయొద్దు అంటూ సూచనలు చేశారు.
అసలు గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గింది, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఎందుకు కాలేదు అనేది మౌలికమైన ప్రశ్న.
మీరి దానికెవరు సమాధానం చెప్పాలి… pic.twitter.com/xj4RSiroNa
— Pasham Raghunandan Reddy (@RaghunandanPch) February 22, 2025
