KTR:మరణించిన వారికి గౌరవం లేదా!

6
- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారికీ కనీస గౌరవం కూడా లేకపోవడం దారుణం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. రాష్ట్రంలో అంబులెన్సులు / మృతదేహ వాహనాలు లేవా? తెలంగాణ సీఎస్ అని ప్రశ్నించారు. మరణించిన వారు, వారి కుటుంబ సభ్యులు కనీస గౌరవానికి అర్హులు కాదా? ఇది ఏ రకమైన అమానవత్వం? చెప్పాలన్నారు.

ఒకరి మృతదేహాన్ని తోపుడు బండ్లలో, ట్రాక్టర్లలో, చెత్త వాహనాల్లో, టోయింగ్ వాహనాల్లో తరలించే కాలంలో మనం జీవిస్తున్నామా? చెప్పాలన్నారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

https://x.com/KTRBRS/status/1985562852397367429

- Advertisement -