ఇదేనా రేవంత్ తీసుకొచ్చిన మార్పు: కేటీఆర్

3
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. శాసనసభలో రైతు భరోసాపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పును అని సీఎంను ప్ర‌శ్నించారు కేటీఆర్.

పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి… పురుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి.. ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్…ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12 వేల సాయమేది? అని దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! ఇదే.. ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు! అని కేటీఆర్ విమ‌ర్శించారు.

Also Read:45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

- Advertisement -