తెలంగాణలో సమైక్య సంక్షోభం!

33
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సమైఖ్యాంధ్ర నటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటి కష్టాలు, కరెంటు కోతలు, రైతుల ఆగచ్చట్లు, నేతన్నల ఆర్తనాదాలు, నిరుద్యోగుల ఎదురు చూపులు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించి వాటి అమలు పైనే దృష్టి పెడుతూ ఇతర అంశాలను పూర్తిగా గాలికి వదిలేసింది కాంగ్రెస్ సర్కార్. పోనీ ఇచ్చిన హామీలనైనా సరిగా అమలు చేస్తోందా ? అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో తెలంగాణ పజల గోడు తీర్చేదేవరో తెలియక ప్రజలు తల పట్టుకుంటూన్న పరిస్థితి..

గత కే‌సి‌ఆర్ పాలనలో పుష్కలమైన నీరు, ఎలాంటి కరెంటు కోతలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలిచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్లు అయిందని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆసరాగా ఉన్న రైతు బంధు పథకాన్ని అపడమే కాకుండా ఎన్నికల ముందు ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఇక నేతన్నల పరిస్థితి మరి దారుణంగా ఉంది. నేతన్నలకు సాయంగా ఉండే చేనేత మిత్రా పథకాన్ని అపడమే కాకుండా బతుకమ్మ చీరాల ఆర్డర్లు ఆపడం, బిల్లులు పెండింగ్ లో ఉంచడంతో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నేతన్నల ప్రస్తుత పరిస్థితిపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ సి‌ఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బి‌ఆర్‌ఎస్ పాలనలో కలకలలాడిన చేనేతరంగం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నబిన్నం అయిందని కే‌టి‌ఆర్ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. చిత్తశుద్దితో చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధుకోవాలని కే‌టి‌ఆర్ లేఖలో వివరించారు. ఏది ఏమైనప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నటి సమాఖ్య రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయనేది చాలమంది అభిప్రాయం.

- Advertisement -