కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ సర్కార్‌పై విచారణకు ఎందుకు ఆదేశించరు, ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తెలంగాణను ఏటీఎంలా వాడుకున్నారని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా? అని అడిగారు.
కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. మరోవైపు.. ధాన్యం దిగుబడిలో పంజాబ్ నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం అత్యంత దురదృష్టకరం అని వాపోయారు.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి? కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా? అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా? ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించేశారు. మరోసారి మీరు ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటి? చెప్పాలన్నారు.
గౌరవ అమిత్ షా గారు..
తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..?
కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి…
— KTR (@KTRBRS) June 29, 2025
Also Read:సాయి లేని లోటు తీరనిది:హరీష్

