2015 నవంబర్ 5..కేసీఆర్ పాలనలో టీహబ్‌ను స్థాపించారు. ఇది భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపే పునాది వేసిన రోజు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కె.సి.ఆర్. గారి దూరదృష్టి నాయకత్వంలో, మేము సమగ్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాము, హైదరాబాద్‌ను “స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా స్థాపించాము అని ఎక్స్ వేదికగా తెలిపారు.
టీ-హబ్ ఈ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే — దానికి కొనసాగింపుగా వి-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ-వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, మరియు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) ఏర్పడడం ద్వారా మన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచింది అన్నారు.
“టీ-హబ్ ఆధునిక భారతదేశానికి ప్రతిబింబం.” ప్రారంభ దశ నుంచి ప్రస్తుత ప్రతిష్టాత్మక స్థాయికి ఎదిగిన టీ-హబ్ పరిణామం, నేను ఐటీ మంత్రిగా ఉన్న కాలంలో గర్వపడే క్షణాల్లో ఒకటి. ఇన్నోవేషన్‌కు దారితీస్తూ, వందలాది టెక్ స్టార్టప్స్ తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు శక్తినిచ్చిన టీ-హబ్‌కి నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు కేటీఆర్.
November 5th, 2015, marked @THubHyd Formation Day, laying the foundation for Telangana’s rise as a leader in India’s startup ecosystem.
Under Sri KCR garu’s visionary leadership, we’ve built a comprehensive innovation ecosystem, establishing Hyderabad as the Startup Capital of… pic.twitter.com/ULVFiAxjlU
— KTR (@KTRBRS) November 5, 2025

