తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు ఈ కోర్టులు సత్వరం విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం 6 నెలల వ్యవధిలో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 3 తీవ్రమైన నేరాల్లో తీర్పులు వెలువరించాయని తెలిపారు.
ఈ కేసుల్లో ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు, హోం డిపార్ట్ మెంట్ అధికారులకు శుభాభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు తీవ్రంగా శ్రమించారని అభినందించారు.
Within a span of six months, fast-track courts in Telangana have delivered justice in 3 ghastly crimes against women. All 5 accused have been sentenced to capital punishment
Kudos to the Law & Home Dept officials & Judiciary who have toiled hard to ensure quick justice 👏👍
— KTR (@KTRTRS) February 7, 2020