రివ్యూః జాను

2285
Jaanu Movie Review
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం జాను. తమిళ్ 96పేరుతో తెరకెక్కిన ఈచిత్రాన్ని తెలుగులో రిమేక్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తమిళ్ భారీ విజయాన్ని సాధించిన ఈచిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథః

రామచంద్ర (శర్వానంద్‌) ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. తన శిష్యబృందంతో కలిసి వివిధ ప్రదేశాల్ని సందర్శిస్తుంటాడు. చిన్నప్పుడు జాను , రామ్ ఇద్దరు ప్రేమించుకుంటారు. స్కూల్ ఏజ్‌లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఇద్దరు విడిపోతారు.రీ యూనియన్ పార్టీలో ఇద్దరు కలుస్తారు. రామచంద్ర. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న రామచంద్ర-జాను తమ ప్రేమజ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరం కోల్పోయామని బాధపడుతుంటారు. ఈ క్రమంలో రామచంద్ర నుంచి జాను ఏం కోరుకుంది? చివరకు ఈ వీరిద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అన్నదే చిత్ర కథ.

jaanu

కథనంః

రెండేళ్లకిందట తమిళ్ లో వచ్చిన 96మూవీ సంచలన సృష్టించింది. విజయ్ సేతపతి, త్రిషలు జంటగా నటించారు. ఇకపోతే తెలుగులో సమంత, శర్వానంద్ లు అద్భుతంగా నటించారు. జాను, రామ్ పాత్రల్లో ఇమిడిపోయారు. తమిళ్ లో ఈమూవీని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహించారు. తమిళ ‘96’ కథాంశంలో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగు వెర్షన్‌ను రూపొందించారు. అయితే తెలుగు ఇతివృత్తాన్ని 2004 నేపథ్యంలో చూపించారు. సమంత, శర్వానంద్ లాంటి క్యాస్ట్ ఉండటం కూడా సినిమాకు కలిసొచ్చింది. జాను రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. పాటలు ఫైట్స్ ఉండవు.. అన్నీ సిచ్యువేషనల్‌గా వచ్చే పాటలు.. కామెడీ సన్నివేశాలే. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రేమ్. అయితే తమిళ వెర్షన్‌ను చూసిన వారికి ‘జాను’లో ఏదో ఎమోషన్‌ మిస్‌ అయిందనే భావన కలుగుతుంది.

jaanu
విశ్లేషణః
శర్వానంద్, సమంతలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరు చక్కగా నటించారు. స్కూల్ లవ్ ట్రాక్ బాగున్నా కూడా ఆ తర్వాత ఎందుకో స్లోగా అనిపిస్తుంది. దాంతోపాటు సెకండాఫ్ సన్నివేశాలు కూడా సాగదీసినట్లు అనిపించాయి. ఈ సినిమా మొత్తం రామ చంద్రన్ , జాను పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరూ పీక్స్‌లో నటించారు. తమ పర్ఫామెన్స్‌తో వారిద్దరు ఈ సినిమాకు బలంగా మారారు.అయితే ఒరిజినల్ సినిమాను చూడని ప్రేక్షకుడు.. రీమేక్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా గతంలోకి వెళ్లి వస్తాడు. తమిళ్ లో 96సినిమా చూడని వాళ్లకు ఈసినిమాను చూసి చాలా ఎమోషనల్ గా ఫీలవుతారు. ఇక ఈసినిమాకు గోవింద్ వసంత్ అందించిన సంగీతం చాలా బాగుంది. ప్రతీ పాట సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి.. ఫీల్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఊహలే ఊహలే పాట వచ్చినప్పుడు థియేటర్లలో ఓ తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. మహేంద్రన్ జయరాజ్ ఫోటో గ్రఫీ అధ్బుతంగా ఉంది. వెన్నెల కిషోర్, శరణ్యలు చాలా బాగా నటించారు. ఫైనల్ గా ఇది మంచి ప్రేమ కథ అని చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్
సమంత ,శర్వానంద్, సంగీతం, దర్శకత్వం
మైనస్ పాయింట్స్
రీమేక్ చిత్రం కావడం, స్లో నెరేషన్

విడుదల తేదీః07/02/2020
రేటింగ్ః 2.75/5
నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యా ప్రదీప్ తదితరులు
దర్శకత్వం : సీ ప్రేమ్ కుమార్
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : గోవింద్ వసంత్

- Advertisement -