ప్రజలకు మరింత చేరువగా… మీసేవ

235
Ktr Praises Mee seva operators
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మీ సేవ  స్వల్పకాలంలోనే రూ.10 కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిపిన తొలి రాష్ట్రంగా నిలవడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.  రవీంద్రభారతిలో మీ సేవ ఆపరేటర్ల అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్  మీసేవలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్న ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. లంచాలకు తావు లేకుండా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మీ సేవ ఉందన్నారు. మీ సేవ ద్వారా నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.

86 ఏండ్ల తర్వాత తెలంగాణలో భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుందన్నారు కేటీఆర్.రాజన్న  సిరిసిల్ల జిల్లా వంద శాతం భూరికార్డుల ప్రక్షాళన చేసిన తొలిజిల్లాగా నిలిచిందని తెలిపారు. మీసేవతో 600 రకాల సేవలు అందిస్తున్నామని  చెప్పారు.

Ktr Praises Mee seva operators
భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు నీరందించే బాధ్యతను భుజానవేసుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నీళ్ళు  ఇవ్వకుంటే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. సాంకేతికతతో తెలంగాణ రానున్న రోజుల్లో మరిన్ని అద్బుతాలను సృష్టిస్తుందన్నారు.

- Advertisement -