KTR:కొప్పుల జీవితం స్పూర్తిదాయకం

37
- Advertisement -

గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ పై ప్రశంసల జల్లు కురిపించారు కేటీఆర్.

సింగరేణి కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర మంత్రి దాకా ఒక్కో మెట్టు ఎదిగిన తీరును రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 80 వ దశకం చివరలో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన… క్రమంగా కార్మిక సంఘ నాయకుడిగా ఎదిగారన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారు. సింగరేణి కార్మికులకు ఆయన ఎనలేని మేలు చేశారన్నారు.

ఆ తర్వాత 90 వ దశకం చివర్లో ప్రజా జీవితంలో చేరారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో 2001 లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. 2004 లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా, కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేశారన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం, నిబద్ధత కలిగిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన కొప్పుల ఈశ్వర్ ని మించి నాయకుడు మరొకరు లేరు..పెద్దపల్లి ప్రజలు ఆయనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపించాలన్నారు.

Also Read:చెరుకురసం తాగితే ప్రమాదమే..జాగ్రత్త!

- Advertisement -