శాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన చిత్రం `కె.జి.ఎఫ్`. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. విడుదలైన కొద్దిరోజుల్లో వందకోట్ల వసూళ్లను రాబట్టి కన్నడనాట సరికొత్త చరిత్ర సృష్టించింది.
తాజాగా ఈ సినిమా చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఎఫ్ చిత్రంపై ప్రశంసలు గుప్పించారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడిన కేటీఆర్ యష్ రఫ్పాడించాడని ట్వీట్ చేశారు. కొద్దిగా ఆలస్యంగానైనా ‘కెజిఎఫ్’ మూవీ చూశా. వాట్ ఏ మూవీ. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. టెక్నికల్ గా
కూడా అద్భుతంగా ఉందని ప్రశంసలు గుప్పించారు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రిలోకి ప్రవేశించిన యష్ ఒక్కసినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరో అయిపోయాడు. కన్నడలో ప్రస్తుతం ఏ సూపర్‌స్టార్‌కి సాధ్యం కాని అరుదైన ఫీట్‌ని సాధించాడు.ఇప్పటివరకు కన్నడ సినిమా చరిత్రలో వందకోట్లు రాబట్టిన మూవీ లేదు. కేజీఎఫ్‌తో సరికొత్తరికార్డు సృష్టించిన యష్..ఈ సినిమా సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్2తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
May be I am little late but finally watched #KGF What a movie!! Brilliant technically, intense & cool; all at the same time. Superb direction by #PrashanthNeel gripping screenplay, terrific BGM & what a rock star like screen presence! @TheNameIsYash 😎
— KTR (@KTRTRS) February 24, 2019