KTR: తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్

3
- Advertisement -

చావునోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ సాధించిన నాయ‌కుడు కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల‌నే ఒకే ఒక్క కోరితో గ‌ట్టిగా ప‌ని చేస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండ‌ర్‌ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడిన కేటీఆర్… ప్ర‌జ‌ల ఆశీస్సులు పూర్తిస్థాయిలో తిరిగి పొందాల‌ని, మ‌న‌కు ఎదుర‌య్యే అడ్డంకులు ఎదుర్కొనే శ‌క్తి ఆ భ‌గ‌వంతుడు మీకు ప్ర‌సాదించాల‌ని, మీ కుటుంబాల‌తో సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం, రాష్ట్రం ఎల్ల‌వేళ‌లా ప్ర‌శాతంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Also Read:కోలుకుంటున్న శ్రీతేజ్: సీతక్క

- Advertisement -