పుత్రోత్సాహం..హిమాన్షుతో కేటీఆర్

484
himanshu ktr
- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్ మనవడు,కేటీఆర్ కుమారుడు హిమాన్షు. ఓ వైపు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే కేటీఆర్ ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. తాజాగా హిమాన్షును హగ్‌ చేసుకుంటూ ఫోటో దిగారు కేటీఆర్. నీ వయసు 13 సంవత్సాలే నాకంటే ఎత్తు(హైట్‌) ఎదిగావు అంటూ హిమాన్షుని హగ్ చేసుకున్న ఫోటోని షేర్ చేశారు. కేటీఆర్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Image result for హిమాన్షు కేటీఆర్

సీఎం కేసీఆర్ ముద్దుల మనవడిగా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు హిమాన్షు. కేసీఆర్ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లిన హిమాన్షు ఉండాల్సిందే. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన యాగంలో హైలైట్‌గా నిలిచినా,భద్రాద్రి రాములోరి కల్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన హిమాన్షుకే చెల్లింది.

ఇక సాయం చేయడంలోనూ వయసు చిన్నదే కానీ మనసు మాత్రం పెద్దది. 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలానికి చెందిన నూకసాని శ్రీనివాసరావు వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన శ్రీనివాస్ తన బాధను సోషల్ మీడయా ద్వారా వెల్లడించగా మెరుగైన వైద్యం అందించేందుకు హిమాన్షు ముందుకువచ్చారు. చిన్నవయసైనా హిమాన్షు స్పందించిన తీరుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

- Advertisement -