జీహెచ్‌ఎంసీ కార్మికులపై కేటీఆర్ ప్రశంసలు

335
ktr
- Advertisement -

కరోనాపై పోరులో అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు పోలీసులు,వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు. ఇక ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు 21 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. 5 వేల స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, సహాయకులు కలిసి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి రోజూ 6 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా చెత్తను సేకరించి తరలిస్తున్నారు వారికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు.

- Advertisement -