కేసీఆర్..కాల్వలు,చెరువులు,రిజర్వాయర్లు

226
ktr
- Advertisement -

సీఎం కేసీఆర్ పేరుకు సరికొత్త నిర్వచనం చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…..కేసీఆర్ అంటే కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లు అని తెలిపారు.

కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్‌ పేరు సార్థకమైందన్నారు‌. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించారని …సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు పేర్కొన్నారు.

కొండపోచమ్మ సాగర్‌ కింద 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేశావపురం రిజర్వాయర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కేటీఆర్‌.

- Advertisement -