కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడే దమ్మున్న నాయకుడు వినోద్ కుమార్ అన్నారు.
24 ఏండ్లుగా కేసీఆర్‌తో నడుస్తున్న సహచరుడు.. ఒక తమ్ముడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన పాల్గొన్న నాయకుడు అన్నారు. మళ్లీ ఈ రోజు కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. అలాంటి నాయకుడి గొంతు మనం ర్లమెంట్‌లో వినాలన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ స్మార్ట్ సిటీని సాధించారు. కేసీఆర్ సూచన మేరకు కరీంనగర్‌కు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేశారన్నారు.
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ముందు ఉండి నడిచిన నాయకుడు…ఎంపీగా కరీంనగర్‌కు స్మార్ట్ సిటీని సాధించిన దమ్మున్న లీడర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు.
పార్లమెంటులో మన గొంతు వినిపించేందుకు కారు గుర్తుకు వోటు వేద్దాం.#BoianapalliVinodKumar #ParliamentElection2024 pic.twitter.com/OQB7kwn3xs
— B Vinod Kumar (@vinodboianpalli) May 8, 2024