తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై మంత్రి కేటీఆర్ తన సంతాపం తెలిపారు. సాయిచంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేటీఆర్, యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Also Read:తొలి ఏకాదశి విశిష్ఠత..
సాయిచంద్ మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, సాయిచంద్ మృతదేహానికి టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులర్పించారు.
Also Read:గుండెపోటుతో సింగర్ సాయిచంద్ మృతి..