ప్రకృతి మాత ముద్దుబిడ్డ, పర్యావరణ పరిరక్షణే తన జీవిత ఆశయంగా బ్రతికిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (దరిపల్లి రామయ్య) మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.
వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని ప్రతీ రోజూ పాటిస్తూ.. కోట్ల మొక్కలు నాటిన వనజీవి రామయ్య మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణకు హరితహారం” కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దరిపల్లి రామయ్య అందించిన సహకారం విశేషమైంది అన్నారు.
పచ్చదనం పెంపునకు వారు చేసిన కృషిని గౌరవిస్తూ.. కేసీఆర్ 2017లో రామయ్య దంపతులకు సన్మానం కూడా చేశారు. ప్రభుత్వాలే చట్టాలను పాటించకుండా నిర్దాక్షిణ్యంగా అడవులను నరికేస్తున్న నేటి రోజుల్లో వనజీవి రామయ్య లాంటి వాళ్ళ అవసరం ఎంతగానో ఉంది అన్నారు.
Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

