పీవీకి కేటీఆర్ ఘన నివాళి

36
- Advertisement -

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు.

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు. ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు. అది కాంగ్రెస్‌ పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా ఐదేళ్ల పూర్తి కాలంపాటు నడిపించిన ఘనత ఆయనది. అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూది ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం పీవీది.

ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. 1921, జూన్ 28న జన్మించిన పీవీ.. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.కేంద్రంలో కాంగ్రెస్ క్లిషంగా ఉన్న సమయంలో నంద్యాల లోక్‌సభ నుండి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. ప్రధానిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూశారు.

Also Read:24న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’

- Advertisement -