హైదరాబాద్‌లో ఐకియా..ప్రత్యేకతలు ఇవే

240
ktr ikea
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. ఇప్పటివరకు పలు మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టగా తాజాగా పశ్చిమాసియాలోనే అతిపెద్ద హోమ్ డెకార్ కంపెనీ ఐకియా స్టోర్స్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ఐకియా స్టోర్స్‌ను ప్రారంభించారు.

ఈ స్టోర్‌ కోసం ఐకియా రూ. 800 కోట్ల రూపాయలు కేటాయించింది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్‌ను అభివృద్ధి చేశారు. స్టోర్‌లో పనిచేసే వారిలో 50 శాతం మంది మహిళలేనని కావడం విశేషం. స్టోర్‌లో 7,500 ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌ తర్వాత ముంబైలో త్వరలో రెండో బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్, అబుదాబి, షార్జా, రియాద్, మస్కట్, బర్వాలలో భారీస్థాయి స్టోర్స్‌ను నిర్వహిస్తున్నది. అరబ్ దేశాలను దాటి తొలిసారిగా తెలంగాణలో రిటైల్ హోమ్ ఫర్నీషింగ్ స్టోర్‌ను నెలకొల్పడం విశేషం.

ఐకియా స్టోర్ ప్రత్యేకతలు..

() 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది
() 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
() 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభించనుండగా ఇందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తోంది
() రూ. 200 లోపే 1000 ఉత్పత్తులు లభించనున్నాయి.
()టెక్స్‌టైల్ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ కాటన్‌తో తయారు చేసినవి కావడం విశేషం
()ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ హైదరాబాద్‌దే. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఫుడ్‌.
అంతేగాదు ఈ రెస్టారెంట్‌ మెనూలో సగం శాకాహార వంటకాలే . ఇడ్లీ సాంబార్, సమోస, వెజ్ బిర్యానీ వంటివి లభిస్తాయి
()తెలంగాణలో త‌యార‌య్యే చేనేత ఉత్ప‌త్తులు కూడా లభించనున్నాయి

- Advertisement -