- Advertisement -
దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయ్యాయని తెలిపారు మంత్రి కేటీఆర్. బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…హైదరాబాద్‌లో ఫార్ములా-ఈను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండియాలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని వెల్లడించారు. మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని…నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -