తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో సిద్దిపేటకు చాలా ప్రాధాన్యత సంతరించుకొంది. సీఎం కేసీఆర్ అమరణ నిరహారదీక్ష చేపట్టిన సిద్దిపేట గడ్డ…కేసీఆర్ పుట్టిన గడ్డ. నేటికి సరిగా 23ఏళ్ల కాలంను పురస్కరించుకొని తెలంగాణ గెజిటేడ్ ఆర్గనైజేషన్స్ యోధ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకం సిద్దిపేట ఉద్యోగ గర్జన దినోత్సవం సందర్భంగా ఉద్యమ ఘట్టాలతో కూడిన ‘యోధ’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఆవిష్కరించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 21-10-2009లో సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేపట్టారు. నాటి ఉద్యోగుల ఉద్యమ నాయకుడు, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉద్యమ ప్రస్థానం, ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, ఉద్యమ ప్రధాన ఘట్టాలపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘంతోపాటు, ఉద్యోగ జేఏసీ.. ‘యోధ’ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ఐక్య కార్యచరణ నాయకులతో కలిసి ఉద్యమ కాలంనాటి అనేక పోరాటాలను, ప్రధాన ఘట్టాలను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొన్నారు.