KTR:ప్రజలను బాధించడం సరికాదు

1
- Advertisement -

సాధారణంగా ప్రజల బాధలను తీర్చడం పాలకుల బాధ్యతని, వారిని బాధించడం ఏమాత్రం సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బహిరంగ లేఖ రాశారు. మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నాడని ఆరోపించారు.

హైడ్రా, మూసీ పేరు చెబితినే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద, మధ్య తరగతి ప్రజలను ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ల చేసిన ఆర్తనాదాలు మీకెందుకు వినబడడం లేదని ప్రశ్నించారు.

అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను హింసించే పులకేసి మాదిరిగా హింసిస్తుంటే.. ఏం తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్‌చుప్‌ అయిపోయారని విమర్శించారు.

రుణమాఫీయే కాదు రైతు భరోసాను ఎత్తగొట్టారని.. బోనస్‌ను బోగస్ చేశారని ఆరోపించారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మల మాదిరిగా తయారయ్యారని.. నమ్మి ఓటు వేసినందుకు ఒక్క వర్గం కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న తీరును సమాజం గమనిస్తోందన్నారు కేటీఆర్.

Also Read:దక్షిణాది భాషల్లో.. ‘ఈసారైనా’

- Advertisement -