ఉత్తరప్రదేశ్,బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠమని పలువురు వ్యాఖ్యానించగా మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. అధికారం శాశ్వతం కాదని…యూపీ లోక్ సభభ స్ధానాల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయని తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలు మరో జాతీయపార్టీ డిపాజిట్‌ను కూడా కోల్పోయేలా చేసిందని ఏదీ శాశ్వతం కాదని సందేశాన్ని పంపిందని తెలిపారు. యూపీలో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమ పదవులకు రాజీనామా చేయగా ఆ స్ధానాల్లో సైతం బీజేపీ ఓడిపోవడం గమనార్హాం. యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫూల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59,460 ఓట్ల ఆధిక్యంతో బీజేపీని మట్టి కరిపించారు.