నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నివాళులు అర్పించారు కేటీఆర్.
ఈ సందర్భంగా ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులైనా ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏదో తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తే కుదరదు అన్నారు కేటీఆర్.
అన్ని అంశాలపై చర్చించే విధంగా స్పీకర్ గారు చొరవ తీసుకోవాలి…రాష్ట్రంలో ప్రస్తుతం 7 డీఏలు పెండింగ్‌లో ఉంటే.. ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వారి అందరి కోసం గొంతు విప్పుతాము… 22A పేరిట జరుగుతున్న కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు.
Also Read:BB10:ఈసారి కంటెస్టెంట్స్ వీరే

