ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది!

7
- Advertisement -

ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యింది.. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! అన్నారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? , జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? చెప్పాలన్నారు.

కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈరోజుతో తేలిపోయింది… నీ గురువుపై విశ్వాసం చూపించడానికి…తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?
నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! ,జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో! అన్నారు.

ఒక్క మాట గుర్తు పెట్టుకో…ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు! ,ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం!,ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! ,తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతాం అన్నారు.

Also Read:72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశం

- Advertisement -