KTR:దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

54
- Advertisement -

2026 తర్వాత జనాభా ప్రాతిపదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని తెలిపారు.

అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..పరేష్ రావల్

జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని చెప్పారు.ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు.

- Advertisement -