- Advertisement -
ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మాట్లాడిన కేటీఆర్.. పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో వివిధ హోదాల్లో ప్రజల కోసం పని చేశానని తెలిపారు.
ఎన్నడూ ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు …మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు కేటీఆర్.
కావాలనే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావులను ఇరికించాలని చూస్తున్నారు అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవన్నీ బోగస్ మాటలు…మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని.. ఇబ్బంది పెట్టాలన్నది వాళ్ల ఆలోచన… రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడు అన్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మంచివి కాదు..కేసులు ఎదుర్కోవడానికైనా, కోర్టుల వరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Also Read:Mogudu:’మొగుడు’..టైటిల్ ప్రోమో
- Advertisement -

